వీరిద్దరూ ఆర్యవైశ్యుల ద్రోహులు: మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
- చంద్రబాబు, పవన్ ఇద్దరూ ఆర్యవైశ్యుల ద్రోహులు
- రోశయ్యను చంద్రబాబు చాలా ఇబ్బంది పెట్టారు
- ఆర్యవైశ్యులపై కపట ప్రేమను చూపిస్తున్నారన్న మంత్రి
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మాచర్లలో గోపవరపు మల్లికార్జునరావును వేధించారని... దీంతో, ఆయన హఠాత్తుగా మరణించారని తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలతో ఆయన భార్య శ్రీదేవి కూడా చనిపోయారని అన్నారు. అప్పట్లో టీడీపీలో ఉన్న శిద్ధా రాఘవరావును కూడా అవమానాలకు గురి చేశారని చెప్పారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిగా ఉన్న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కూడా మార్చేశారని మంత్రి దుయ్యబట్టారు.