కోహ్లీ కంటే రోహిత్ శర్మ బెస్ట్ టెస్ట్ కెప్టెన్ అవుతాడు: వసీం జాఫర్
- రోహిత్ కెప్టెన్సీలో అన్ని సిరీస్ లను వైట్ వాష్ చేస్తున్నారు
- కెప్టెన్సీ బాధ్యతలు సరైన వ్యక్తి చేతుల్లోకి వచ్చాయనిపిస్తోంది
- రోహిత్ గొప్ప కెప్టెన్లలో ఒకడిగా ఎదగడం ఖాయమన్న జాఫర్
రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా అన్ని సరీస్ లను వరుసగా వైట్ వాష్ చేస్తోందని జాఫర్ చెప్పాడు. ఈ ఫలితాలను చూస్తుంటే జట్టు నాయకత్వ బాధ్యతలు సరైన వ్యక్తి చేతుల్లోకి వచ్చాయనిపిస్తోందని అన్నాడు. ఇండియా గడ్డపై ఇటీవల అన్ని ఫార్మాట్లలో జరిగిన మ్యాచ్ లలో భారత జట్టు వరుసగా 14 మ్యాచ్ లను గెలుపొందింది. వీటిలో శ్రీలంకతో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను కూడా భారత్ 2-0తో కైవసం చేసుకుంది.