మహిళల ప్రపంచకప్.. టాస్ గెలిచి భారత్‌కు బ్యాటింగ్ అప్పగించిన ఇంగ్లండ్
- వరుస ఓటములతో ఇంగ్లండ్..
- మూడింటిలో రెండు గెలిచి జోరుమీదున్న భారత్
- గత ప్రపంచకప్ ఫైనల్లో జరిగిన పరాభవానికి ప్రతీకారం కోసం చూస్తున్న మిథాలీ సేన
- గెలిచి ఖాతా తెరవాలన్న పట్టుదలలో ఇంగ్లండ్
మరోవైపు, ఇంగ్లండ్ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓడి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. భారత్‌పై గెలుపు ద్వారా బోణీ చేయాలని భావిస్తోంది. కాగా, టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 18 పరుగులు వద్ద ఓపెనర్ యస్తికా భాటియా వికెట్‌ను కోల్పోయింది. 11 బంతుల్లో 8 పరుగులు చేసిన యస్తిక.. శృన్‌సోల్ బౌలింగులో బౌల్డయింది. ప్రస్తుతం 5 ఓవర్లు ముగిశాయి. భారత్ వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది. స్మృతి మంధాన, కెప్టెన్ మిథాలీ రాజ్ క్రీజులో ఉన్నారు.