అసెంబ్లీలో చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన కొడాలి నాని

Kodali Nani fires on Chandrababu
  • ఎన్టీఆర్ మద్య నిషేధం విధించారు
  • మద్య నిషేధానికి చంద్రబాబు తూట్లు పొడిచారు
  • బెల్ట్ షాపులను ఏర్పాటు చేయించి, మద్యం అమ్మకాలను పెంచారన్న నాని 
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని మరోసారి విమర్శలు గుప్పించారు. ఆనాడు ఎన్టీఆర్ మద్య నిషేధం విధించారని... దానికి తూట్లు పొడుస్తూ చంద్రబాబు తన పాలనలో మద్యం అమ్మకాలను విపరీతంగా పెంచారని విమర్శించారు. ఎక్కడపడితే అక్కడ బెల్ట్ షాపులను ఏర్పాటు చేయించి, మద్యం అమ్మకాలను పెంచారని అన్నారు. మద్యం అమ్మకాల్లో అంతులేని అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. 

జంగారెడ్డిగూడెం మరణాలపై ఎల్లో మీడియా తప్పుడు కథనాలను రాస్తోందని మండిపడ్డారు. రామోజీరావు కూడా ఆ స్థాయికి దిగజారిపోయారని అన్నారు. చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
Go Back to Shorts
Kodali Nani
Chandrababu
Telugudesam

More Telugu News