Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వివాహ వ్యవస్థకి గౌరవం ఇవ్వాలని కోరుకున్నాం: త‌మ‌ విడాకుల‌పై హీరో ఆమిర్ ఖాన్ వ్యాఖ్య‌లు

aamir khan on divorce
  • అందుకే విడిపోయినా మా మ‌ధ్య కోపం లేదు
  • సాధారణంగా విడాకుల‌ తర్వాత ఆ జంట‌ ఒకరిని మరొకరు పట్టించుకోరు
  • వారిద్ద‌రి మ‌ధ్య కోపం ఉంటుంది
  • మేము మాత్రం అలా కాదన్నా ఆమిర్ 
బాలీవుడ్‌ హీరో ఆమిర్ ఖాన్ త‌న‌ భార్య కిరణ్ రావుతో విడాకులు తీసుకున్న విష‌యం తెలిసిందే. అంత‌కు ముందు మొద‌టి భార్య‌ రీనా దత్తాకు కూడా ఆయ‌న విడాకులు ఇచ్చారు. త‌న విడాకుల‌పై ఆమిర్ ఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. త‌మ‌ విడాకుల గురించి జ‌నాలు అర్థం చేసుకోవడం చాలా కష్టమ‌ని చెప్పుకొచ్చారు. సాధారణంగా విడాకుల‌ తర్వాత ఆ జంట‌ ఒకరిని మరొకరు పట్టించుకోరని ఆయ‌న అన్నారు. వారిద్ద‌రి మ‌ధ్య కోపం ఉంటుందని చెప్పారు. 

కానీ, తాము మాత్రం అలా కాద‌ని, తాము వివాహ వ్యవస్థకి గౌరవం ఇవ్వాలని కోరుకున్నామ‌ని చెప్పుకొచ్చారు. దీనిపై ఎంతో చర్చించామ‌ని, విడిపోయిన తర్వాత కూడా మంచి ఫ్రెండ్స్‌గా ఉండాలని నిర్ణయాలు తీసుకున్నామ‌ని తెలిపారు. త‌న‌కు త‌న‌ ఇద్దరు మాజీ భార్యలతో మంచి బంధమే ఉండడం త‌న‌ అదృష్టమ‌ని చెప్పుకొచ్చారు. 

తాను, రీనా, కిరణ్, సత్యజీత్ భత్కల్ కలిసి పానీ ఫౌండేషన్‌ను స్థాపించామ‌ని అన్నారు. తాము ఇప్పటికీ కూడా ఆ సంస్థకి సంబంధించిన ప్రాజెక్ట్‌లకి కలిసి పని చేస్తున్నామ‌ని అన్నారు. త‌మ పిల్లల విషయంలో కూడా త‌ల్లిదండ్రులుగా త‌మ‌ బాధ్యతను నిర్వహిస్తున్నామ‌ని తెలిపారు.
Aamir Khan
Bollywood

More Telugu News