Team India: శ్రీలంక ముందు భారీ లక్ష్యం... అప్పుడే ఓ వికెట్ తీసిన టీమిండియా

Team India set huge target to Sri Lanka
  • శ్రీలంక టార్గెట్ 447 రన్స్
  • ముగిసిన రెండో రోజు ఆట
  • 1 వికెట్ నష్టానికి 28 పరుగులు చేసిన శ్రీలంక
  • బుమ్రా ఖాతాలో వికెట్
బెంగళూరు టెస్టులో భారత్ విజయానికి బాటలు వేసుకుంటోంది. శ్రీలంక ముందు 447 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన టీమిండియా... అప్పుడే ఓ వికెట్ తీసి ప్రత్యర్థి జట్టు పతనానికి శ్రీకారం చుట్టింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక జట్టు 7 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. ఓపెనర్ లహిరు తిరిమన్నే (0) బుమ్రా బౌలింగ్ లో డకౌట్ అయ్యాడు. క్రీజులో కెప్టెన్ దిముత్ కరుణరత్నే (10 బ్యాటింగ్), కుశాల్ మెండిస్ (16 బ్యాటింగ్) ఉన్నారు. 

అంతకుముందు తన రెండో ఇన్నింగ్స్ ను టీమిండియా 303-9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. శ్రేయాస్ అయ్యర్ 67, పంత్ 50, జడేజా 22, రోహిత్ శర్మ 46, విహారి 35, మయాంక్ అగర్వాల్ 22 పరుగులు చేశారు.

కాగా, లంక జట్టులో సీనియర్ పేసర్ సురంగ లక్మల్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సందర్భంగా లక్మల్ ను టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ శుభాకాంక్షలు తెలిపారు.
Team India
Sri Lanka
Target
Bengaluru

More Telugu News