Anand Mahindra: నాగ్ అశ్విన్... నువ్వు హాలీవుడ్ ను కూడా కొల్లగొడతావు: ఆనంద్ మహీంద్రా

Anand Mahindra says Nag Ashwin can beat Hollywood hollow
  • ప్రభాస్ తో ప్రాజెక్ట్ కె తెరకెక్కిస్తున్న నాగ్ అశ్విన్
  • ఆధునిక కార్ల కోసం ఆనంద్ మహీంద్రా సాయం కోరిన వైనం
  • వెంటనే స్పందించిన మహీంద్రా
  • మహీంద్రా రీసెర్చ్ సెంటర్ ను సందర్శించిన నాగ్ అశ్విన్
టాలీవుడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తాజాగా ప్రభాస్ తో ప్రాజెక్ట్ కె పేరిట సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అడ్వాన్స్ డ్ టెక్నాలజీ కార్లను చూపించాల్సి రావడంతో నాగ్ అశ్విన్ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సాయం కోరారు. దాంతో వెంటనే స్పందించిన ఆనంద్ మహీంద్రా... తమ సంస్థ గ్లోబల్ ప్రొడక్ట్ డెవలప్ మెంట్ చీఫ్ వేలు మహీంద్రాను పురమాయించారు. 

ఈ నేపథ్యంలో, నాగ్ అశ్విన్ తాజాగా మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ కేంద్రానికి విచ్చేశారు. అక్కడి పరిస్థితులపై ట్వీట్ చేశారు. అందమైన క్యాంపస్ లో అత్యాధునిక టెక్నాలజీ అని అభివర్ణించారు. వేలు మహీంద్రా బృందాన్ని కలిశామని, ఎంతో ప్రభావవంతంగా తమ ప్రస్థానం మొదలైందని వివరించారు. ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రాకు కృతజ్ఞతలు తెలిపారు. 

దీనిపై ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో స్పందించారు. 'మంచిది నాగ్ అశ్విన్' అంటూ బదులిచ్చారు. "మీరు తీస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీతో నన్ను కూడా ఎగ్జయిటింగ్ కు గురిచేశారు. మీరు హాలీవుడ్ ను కూడా కొల్లగొడతారని నాకు గట్టి నమ్మకం కలుగుతోంది" అని పేర్కొన్నారు.
Anand Mahindra
Nag Ashwin
Project K
Prabhas

More Telugu News