దేశంలో కొత్తగా 4,575 కరోనా కేసులు

corona bulletin in inida
  • యాక్టివ్ కేసులు 46,962
  • రోజువారీ పాజిటివిటీ రేటు 0.51 శాతం 
  • నిన్న‌ 8,97,904 టెస్టులు
దేశంలో కొత్త‌గా 4,575 కరోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స తీసుకుంటోన్న వారి సంఖ్య 46,962గా ఉంది. నిన్న క‌రోనా నుంచి 7,416 మంది కోలుకున్నారు. 

ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 4,24,13,566 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 0.51 శాతంగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 77.52 కోట్ల క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు. నిన్న‌ 8,97,904 టెస్టులు చేశారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 179.33 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు. 


Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News