Bandi Sanjay: కేసీఆర్ తాంత్రిక పూజలు చేస్తున్నారు : బండి సంజయ్ ఆరోపణలు

Bandi Sanjay makes sensational comments on KCR
  • ఇతరులు నాశనం కావాలని తాంత్రిక పూజలు నిర్వహిస్తున్నారు
  • రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలను సృష్టిస్తున్నారు
  • బీజేపీ ఎమ్మెల్యేలపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ తాంత్రిక పూజలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఇతరులు నాశనం కావాలని ఆయన ఈ పూజలు నిర్వహిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలను సృష్టిస్తున్నారని...  హోం మంత్రి ఉన్నారో, లేదో తెలియడం లేదని అన్నారు. గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ నుంచి ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం సరికాదని... వారిపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని కోరారు. సభ ప్రారంభమైన కాసేపటికే సస్పెండ్ చేశారని మండిపడ్డారు. ముందస్తు ప్రణాళికలో భాగంగానే సస్పెండ్ చేశారని అన్నారు.
Bandi Sanjay
BJP
KCR
TRS

More Telugu News