UPI123Pay: ఫీచర్ ఫోన్ల కోసం యూపీఐ పేమెంట్ విధానాన్ని ఆవిష్కరించిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్

RBI Governor Shaktikanta Das launches new UPI based payments method for feature phones
  • ఫీచర్ ఫోన్ల కోసం యూపీఐ123పే
  • యూపీఐ ఆధారిత సరికొత్త పేమెంట్ విధానం
  • ఇంటర్నెట్ తో పనిలేకుండా లావాదేవీలు
  • 'డిజి సాథీ' హెల్ప్ లైన్ ను కూడా ఆవిష్కరించిన శక్తికాంత దాస్
ఫీచర్ ఫోన్ల ద్వారానూ చెల్లింపులు చేసేందుకు వీలు కల్పించే పేమెంట్స్ విధానాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేడు ఆవిష్కరించారు. ఈ యూపీఐ ఆధారిత పేమెంట్స్ విధానం పేరు యూపీఐ123పే. డిజిటల్ చెల్లింపులకు మరింత ఊతమిచ్చేందుకు ఈ సరికొత్త విధానం ఉపయోగపడుతుందని శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు, డిజిటల్ చెల్లింపుల 24x7 హెల్ప్ లైన్ 'డిజి సాథీ'ను కూడా ఆవిష్కరించారు. 

కాగా, యూపీఐ123పే ద్వారా వినియోగదారులు ఫీచర్ ఫోన్ల సాయంతోనూ అన్ని రకాల ఆర్థిక లావాదేవీలు జరుపుకోవచ్చు. అయితే స్కాన్ అండ్ పే మాత్రం సాధ్యం కాదు. ఈ పేమెంట్ విధానంతో లావాదేవీలకు ఇంటర్నెట్ కనెక్షన్ తో పనిలేదు. యూజర్లు తమ బ్యాంక్ అకౌంట్ తో ఫీచర్ ఫోన్ ను అనుసంధానించుకుంటే సరిపోతుంది. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు.
UPI123Pay
Payments Method
Feature Phones
Shaktikanta Das
RBI
India

More Telugu News