Tamil Director: భార్యతో విడాకులు తీసుకున్న ప్రముఖ తమిళ సినీ దర్శకుడు

Director Bala divorce
  • భార్యతో విడాకులు తీసుకున్న బాల
  • 17 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు 
  • విడాకులు మంజూరు చేసిన ఫ్యామిలీ కోర్టు
సినీ పరిశ్రమకు చెందిన వారు విడాకులు తీసుకోవడం సాధారణ విషయంగా మారిపోతోంది. ఇటీవలి కాలంలో పలువురు సెలబ్రిటీలు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో జంట విడిపోయింది. ప్రముఖ తమిళ దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత బాల తన భార్య ముధుమలార్ నుంచి విడిపోయారు. ఈ వార్త తమిళ సినీ పరిశ్రమలో సంచలనం రేపుతోంది. నాలుగేళ్ల క్రితమే వీరిద్దరికీ విభేదాలు వచ్చాయి. అప్పటి నుంచి వీరిద్దరూ విడివిడిగానే ఉంటున్నారు. 

ఫ్యామిలీ కోర్టులో వీరిద్దరూ విడాకులకు దరఖాస్తు చేశారు. తాజాగా కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. అయితే వీరు విడిపోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. వీరిద్దరూ 2004లో మధురైలో పెళ్లి చేసుకున్నారు. వీరికి ప్రార్థన అనే కుమార్తె ఉంది. 17 ఏళ్ల వైవాహిక జీవితానికి ఈరోజుతో తెరపడింది. మరోవైపు బాల తన తదుపరి చిత్రాన్ని సూర్యతో చేయనున్నట్టు సమాచారం.
Tamil Director
Bala
Divorce

More Telugu News