భార్యతో విడాకులు తీసుకున్న ప్రముఖ తమిళ సినీ దర్శకుడు
- భార్యతో విడాకులు తీసుకున్న బాల
- 17 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు
- విడాకులు మంజూరు చేసిన ఫ్యామిలీ కోర్టు
ఫ్యామిలీ కోర్టులో వీరిద్దరూ విడాకులకు దరఖాస్తు చేశారు. తాజాగా కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. అయితే వీరు విడిపోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. వీరిద్దరూ 2004లో మధురైలో పెళ్లి చేసుకున్నారు. వీరికి ప్రార్థన అనే కుమార్తె ఉంది. 17 ఏళ్ల వైవాహిక జీవితానికి ఈరోజుతో తెరపడింది. మరోవైపు బాల తన తదుపరి చిత్రాన్ని సూర్యతో చేయనున్నట్టు సమాచారం.