తన హత్యకు కుట్ర కేసుపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏమన్నారంటే...!

  • మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర
  • భగ్నం చేసిన సైబరాబాద్ పోలీసులు
  • కేసు కోర్టు పరిధిలో ఉందని వ్యాఖ్య 
  • అందుకే మాట్లాడడంలేదని వివరణ
  • రాష్ట్ర పోలీసుల సమర్థతపై నమ్మకం ఉందని వ్యాఖ్యలు
తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు రూ.15 కోట్లకు ఒప్పందం జరిగిందంటూ ఇటీవల తెలంగాణ పోలీసులు సంచలన కుట్రను బట్టబయలు చేశారు. ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ తొలిసారిగా స్పందించారు. అయితే ఈ కేసు ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున ఎలాంటి అభిప్రాయాలు వెల్లడించలేనని అన్నారు. తెలంగాణ పోలీసుల సమర్థతపై తనకు నమ్మకం ఉందని, పలు క్లిష్టమైన కేసులను ఛేదించిన ఘనత వారి సొంతమని పేర్కొన్నారు. దేశంలోనే తెలంగాణ పోలీసులకు మంచి పేరుందని అన్నారు.


More Telugu News

V Srinivas Goud Murder Conspiracy Court Police Telangana