బాహుబలి కాజా... రామ్ చరణ్ కు తియ్యని కానుక
- శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్
- రాజమండ్రిలో షూటింగ్
- అభిమానులతో చెర్రీ ఫొటోషూట్
- కాజాను బహూకరించిన సురుచి సంస్థ
రాజమండ్రి వచ్చే ప్రముఖులకు బాహుబలి కాజాను బహూకరించడం ఓ ఆనవాయతీగా వస్తోంది. గతంలో సమంత, నాగార్జున, కృతి శెట్టి, ఫరియా అబ్దుల్లా తదితర సినీ తారలు కూడా ఈ స్పెషల్ కాజా రుచి చూశారు. తాజాగా, ఈ బాహుబలి కాజాను దర్శకుడు శంకర్ కు కూడా అందజేశారు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇంకా పేరుపెట్టలేదు. రామ్ చరణ్ కు ఇది 15వ చిత్రం కావడంతో ఆర్సీ 15 వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజ్ నిర్మిస్తున్నారు.
.