'తొక్కుకుంటూ పోవాలె'.. 'ఆర్ఆర్ఆర్' విడుద‌ల నేప‌థ్యంలో వైర‌ల్ అవుతోన్న మీమ్స్ ఇవిగో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'తొక్కుకుంటూ పోవాలె'.. 'ఆర్ఆర్ఆర్' విడుద‌ల నేప‌థ్యంలో వైర‌ల్ అవుతోన్న మీమ్స్ ఇవిగో

rrr memes viral
  • రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌' 
  • సినిమా ఈ నెల 25న విడుద‌ల‌
  • ట్రెండింగ్ లో #ThokkukuntuPovaale, #ManOfMassesNTR
రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌' విడుదలకు సిద్ధ‌మ‌వుతోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా ఈ నెల 25న విడుద‌ల‌వుతున్న నేప‌థ్యంలో ఆర్ఆర్ఆర్ గురించి నెటిజ‌న్లు సృష్టిస్తోన్న‌ మీమ్స్ సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. 

                        
గ‌తంలోనూ ఈ సినిమా విడుద‌ల‌ ప‌లు సార్లు వాయిదా ప‌డిన నేప‌థ్యంలో అప్ప‌ట్లోనూ మీమ్స్ బాగా వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సృష్టించ‌నున్న రికార్డుల‌పైనే అంద‌రి అంచ‌నా ఉంది. ఈ విష‌యంపైనే నెటిజన్లు మ‌రోసారి త‌మ ప్ర‌తిభ‌కు సాన‌పెడుతూ మీమ్స్ సృష్టిస్తున్నారు. 
                                 
ఈ సినిమాలోని ''నక్కి నక్కి గాదే.. తొక్కుకుంటూ పోవాలే... ఎదురొచ్చినోడ్ని ఏసుకుంటూ పోవాలే'' అన్న డైలాగుతో మీమ్స్ అధికంగా వ‌స్తున్నాయి. #ThokkukuntuPovaale, #ManOfMassesNTR హ్యాష్ ట్యాగ్‌ల‌తో మీమ్స్ సృష్టిస్తున్నారు. 

        
నాలుగేళ్ల ఉపవాసం ఉన్న పులిలా తార‌క్ అన్న అభిమానులు ఉన్నారంటూ ఆయ‌న ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ''అనకాపల్లి నుండి అమెరికా వరకూ, కశ్మీర్ నుండి కన్యా కుమారి వరకూ బాక్సాఫీస్ ఊచకోత మొదలు ఇంకా'' అంటూ ట్వీట్లు చేస్తున్నారు.
RRR
Viral Pics
Viral Videos

More Telugu News