మహిళల ప్రపంచ కప్: అర్ధ సెంచరీ బాదిన స్మృతి.. ఐదు వికెట్లు కోల్పోయిన భారత్
- వడివడిగా వికెట్లు కోల్పోతున్న భారత్
- రెండో వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన మంధాన, దీప్తి శర్మ
- నిరాశపరిచిన షెఫాలీ వర్మ
ఆ వెంటనే భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. 75 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న స్మృతి మంధాన (52) కూడా పెవిలియన్ చేరింది. అనంతరం క్రీజులోకి వచ్చిన హర్మన్ ప్రీత్ కూడా ఆకట్టుకోలేకపోయింది. 14 బంతులు ఆడి 5 పరుగులు మాత్రమే చేసి అవుటైంది. ఆ వెంటనే రిచా ఘోష్ (1) కూడా పెవిలియన్ బాట పట్టడంతో భారత్ కష్టాల్లో పడింది. ప్రస్తుతం 31 ఓవర్లు ముగిశాయి. భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. కెప్టెన్ మిథాలీ రాజ్, స్నేహ్ రాణా క్రీజులో ఉన్నారు.