ఉక్రెయిన్ వీడిన జెలెన్‌స్కీ.. ఎక్కడున్నారో చెప్పిన రష్యా
- జెలెన్ స్కీ పరారీ అంటూ ఇదివరకే రష్యా ప్రచారం
- వీడియోతో తిప్పికొట్టిన జెలెన్ స్కీ
- తాజాగా జెలెన్ స్కీ పరారీపై రష్యా మీడియా కథనాలు
- పోలండ్‌లో తలదాచుకున్నట్లు వెల్లడి
మరోపక్క, యుద్ధం మొదలైన తొలి రెండు రోజుల్లోనే జెలెన్ స్కీ భయపడి విదేశాలకు పారిపోయారని రష్యా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే రష్యా చెప్పేదంతా అబద్ధమేనని ప్రకటించిన జెలెన్ స్కీ.. తాను ఉక్రెయిన్‌లోనే ఉన్నట్లుగా వీడియో విడుదల చేశారు. ఇలాంటి నేపథ్యంలో తాజాగా జెలెన్ స్కీ దేశం వదిలి పరారయ్యారంటూ రష్యాకు చెందిన మీడియా కథనాలు ప్రసారం చేస్తున్నాయి. ఉక్రెయిన్‌ను వీడిన జెలెన్ స్కీ.. ప్రస్తుతం పోలండ్‌లో ఉన్నారని కూడా రష్యా మీడియా చెబుతోంది. మరి ఈ వార్తల్లో ఏ మేర నిజముందన్న విషయం తేలాల్సి ఉంది.