మాకు చిక్కిన రష్యన్ సైనికులను వారి తల్లులకు అప్పగిస్తాం: ఉక్రెయిన్
- తల్లులు వస్తే వారి పిల్లలను అప్పగిస్తాం
- తమది పుతిన్ మాదిరి ఫాసిస్టు ఆలోచనాధోరణి కాదు
- తల్లులు, వారి బిడ్డలపై మేము యుద్ధం చేయం
మరోవైపు తమకు పట్టుబడిన రష్యన్ సైనికులను వారి తల్లులకు అప్పగించేందుకు ఉక్రెయిన్ ప్రభుత్వం సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ కు వచ్చి మీ పిల్లలను తీసుకెళ్లాలని తెలిపింది. తల్లులు వస్తే వారి పిల్లలను అప్పగిస్తామని చెప్పింది. తాము ఉక్రెయిన్ పౌరులమని... తమది పుతిన్ లా ఫాసిస్టు ఆలోచనాధోరణి కాదని తెలిపింది. తల్లులు, వారి బిడ్డలపై తాము యుద్ధం చేయమని చెప్పింది.