నిజంగానే నేను చాలా హర్ట్ అయ్యాను: సంయుక్త మీనన్ చమత్కారం
- 'భీమ్లా నాయక్'గా పవన్ కల్యాణ్
- వసూళ్ల పరంగా కొత్త రికార్డుల నమోదు
- నిత్యామీనన్ అలిగినట్టుగా ప్రచారం
- గడుసుగా సమాధానమిచ్చిన సంయుక్త మీనన్
ఈ సినిమాలో తన పాత్రకి సంబంధించిన హిట్ సాంగ్ తో పాటు, కొన్ని సీన్స్ లేపేశారని నిత్యామీనన్ అలిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక తనకి సంబంధించిన సీన్స్ కూడా బాగానే కోతకి గురయ్యాయని సంయుక్త మీనన్ కి కూడా కోపాలు వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ విషయంపై ఆమె స్పందించింది.
"నేను చాలా హర్ట్ అయ్యాననే మాట వాస్తవమే. అయితే నా పాత్ర గురించి కాదు .. దాని నిడివి గురించి కాదు. ఈ సినిమాను రెండోసారి థియేటర్లో చూద్దామనుకుంటే ఇంతవరకూ టిక్కెట్ దొరకలేదు .. అందుకు" అంటూ చమత్కరించింది. మొత్తానికి సంయుక్త గడుసు పిండమే. ఆ సంగతి చాలామందికి ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజునే అర్థమైపోయింది కూడా.