Sharwanand: 'ఆడవాళ్లు మీకు జోహార్లు' మేకింగ్ వీడియో ఇదిగో .. చూసేయండి!

Aadavallu Meeku Joharlu making video released
షార్ట్స్‌లో చూడండి
ఈ మధ్య కాలంలో నాయిక ప్రధానమైన కథలతో చాలా సినిమాలు వచ్చాయి. అయితే వాటిలో హారర్ థ్రిల్లర్లు .. సస్పెన్స్ థ్రిల్లర్లు ఎక్కువ. ఎక్కువ మంది లేడీ ఆర్టిస్టులతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్లు మాత్రం రాలేదు. చాలా కాలం తరువాత అలాంటి ఒక సినిమా వస్తోంది. ఆ సినిమా పేరే .. 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. 

శర్వానంద్ - రష్మిక జంటగా నటించిన ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మించగా, కిశోర్ తిరుమల దర్శకత్వం వహించాడు. రాధిక .. ఖుష్బూ .. ఊర్వశి వంటి సీనియర్ నటీమణులు ఈ సినిమాలో కీలకమైన పాత్రలను పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను ఈ నెల 4వ తేదీన థియేటర్లకు తీసుకుని వస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మేకింగ్ వీడియోను వదిలారు. ఎక్కువమంది ఆడవాళ్లే కావడం వలన సెట్ ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేదనీ .. ఒక పిక్నిక్ కి వెళ్లి వచ్చినట్టుగా షూటింగుకి వెళ్లొచ్చానని రష్మిక చెప్పింది. ప్రతి రోజు ఎంతో సరదాగా .. సందడిగా గడిచిందని అంది. ఈ మేకింగ్ వీడియో చూస్తుంటే రష్మిక మాటలు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పకుండా ఉండలేము.
Go Back to Shorts
Sharwanand
Rashmika Mandanna
Kishore Thirumala
Aadavallu Meeku Joharlu Movie

More Telugu News