ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన భారతీయులకు స్మృతి ఇరానీ అరుదైన స్వాగతం
- ఆపరేషన్ గంగ నిర్విఘ్నంగా కొనసాగుతున్న వైనం
- బుధవారం భారతీయ విద్యార్థులతో ఢిల్లీలో ల్యాండైన్ ఇండిగో ఫ్లైట్
- నాలుగు భాషల్లో విద్యార్థులకు స్వాగతం పలికిన స్మృతి ఇరానీ
బుధవారం ఉక్రెయిన్ నుంచి బయలుదేరి ఢిల్లీలో ల్యాండైన ఇండిగో విమానంలో సామాన్య పౌరుల కంటే విద్యార్థులే అధికంగా ఉన్నారు. వీరంతా క్షేమంగా దేశానికి తిరిగివచ్చిన సందర్భంగా వారికి వెరైటీగా స్వాగతం పలకాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ భావించారు.
విమానం ల్యాండవగానే..అందులోకి ఎక్కిన స్మృతి ఇరానీ.. స్వదేశానికి సురక్షితంగా తిరిగి వచ్చిన మీకందరికీ స్వాగతం అంటూ స్మృతి తెలిపారు. అదేదో ఏ ఒక్క భాషలోనే కాకుండా ఏకంగా నాలుగు భాషల్లో స్మృతి విద్యార్థులకు స్వాగతం పలికారు. స్మృతి ఇరానీ ఏమాత్రం తడబాటు లేకుండా నాలుగు భాషల్లో స్వాగతం చెప్పడంపై విద్యార్థులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.