Mohanbabu: సినీ నటుడు మోహన్‌బాబు, ‘మా’ అధ్యక్షుడు విష్ణు నిరుపేదలా?.. వారి పేరిట ఏపీలో దరఖాస్తు పట్టాల మంజూరు

Actors Mohanbabu and vishnu have land in ap which is actually to give poor people
  • సాగుభూమి లేని  నిరుపేదలకు ఇచ్చే భూమి కేటాయింపు
  • మోహన్‌బాబుకు 2.79 ఎకరాలు, విష్ణుకు 1.40 ఎకరాలు
  • 2015లో పట్టాలు.. తాజాగా వెలుగులోకి
ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు, ఆయన కుమారుడు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు నిరుపేదలా? సోషల్ మీడియాలో ఇప్పుడీ విషయమై ఎడతెగని చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని సాగు భూమి లేని నిరుపేదలకు కేటాయించే దరఖాస్తు పట్టాలు వారిపేరిట మంజూరు కావడమే ఈ చర్చకు కారణం. ఆన్‌లైన్ రెవెన్యూ రికార్డుల్లో నమోదైన ఈ వివరాలు వెలుగులోకి రావడంతో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లి-68 గ్రామ రెవెన్యూ లెక్క దాఖలా సర్వే నంబరు 412-1ఎలోని 2.79 ఎకరాలను మోహన్‌బాబు పేరిట, 412-1బిలో 1.40 ఎకరాలను విష్ణు పేరిట దరఖాస్తు పట్టా జారీ చేశారు. 2015లోనే దరఖాస్తు పట్టాలు మంజూరు చేయగా ఆ వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చి సంచలనమయ్యాయి. ఈ విషయమై స్పందించిన తహసీల్దారు శిరీష పూర్తి వివరాలు పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. 
Mohanbabu
Manchu Vishnu
Andhra Pradesh
Tollywood
Land

More Telugu News