Ukraine: ఉక్రెయిన్ నుంచి హైదరాబాద్ చేరుకున్న విద్యార్థులకు టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

Free Journey in TSRTC Buses for students who came from Ukraine
  • ఉక్రెయిన్ నుంచి హైదరాబాద్ చేరుకున్న తెలంగాణ విద్యార్థులు
  • నగరం నుంచి స్వస్థలాలకు ఉచితంగా బస్సులో ప్రయాణం
  • ఉక్రెయిన్ నుంచి వచ్చినట్టు ఆధారం చూపిస్తే చాలు
యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయి తిరిగి హైదరాబాద్ చేరుకున్న తెలంగాణ విద్యార్థుల కోసం టీఎస్ ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. విద్యార్థులు వారి వారి స్వస్థలాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్టు తెలిపింది. 

శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఎంజీబీఎస్, జేబీఎస్‌కు చేరుకున్న విద్యార్థులు కానీ, మార్గమధ్యంలో ఎక్కిన వారు కానీ ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొంది. అయితే, తాము ఉక్రెయిన్ నుంచి వచ్చినట్టు తగిన ఆధారం చూపించాల్సి ఉంటుందని ఆర్టీసీ వివరించింది.
Ukraine
Russia
TS RTC
Free Journey

More Telugu News