Sammakka: మేడారం కానుకల లెక్కింపు ప్రారంభం.. ఇప్పటికే రూ. 10 కోట్లు దాటిన వైనం

Medaram jatara Hundi Revenue crossed rs10 crores
  • హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో లెక్కింపు
  • ఇప్పటి వరకు 450 హుండీల లెక్కింపు 
  • బంగారు, వెండి ఆభరణాలు, విదేశీ కరెన్సీ లెక్క తేలాల్సి ఉంది
  • గత జాతర ఆదాయం రికార్డు బద్దలయ్యే అవకాశం

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా వాసికెక్కిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా భక్తులు సమర్పించుకున్న కానుకల లెక్కింపు ప్రారంభమైంది. హనుమకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలో కానుకలను లెక్కిస్తున్నారు. ఇప్పటికే ఆదాయం రూ. 10 కోట్లు దాటింది. మొత్తం 497 హుండీలకు గాను ఇప్పటి వరకు 450 హుండీల లెక్కింపు పూర్తయింది.

10,00,63,980 రూపాయల ఆదాయం లెక్క తేలింది. భక్తులు సమర్పించిన బంగారు, వెండి ఆభరణాలతోపాటు విదేశీ కరెన్సీ విలువను కూడా లెక్కించాల్సి ఉంది. నాణేల లెక్కింపు తర్వాత మొత్తం వివరాలను వెల్లడించనున్నట్టు అధికారులు తెలిపారు. గత జాతరలో రూ. 11,64,00,000 ఆదాయం సమకూరగా, ఈసారి ఆ రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News