భీమ్లానాయక్ సినిమా టికెట్లు అధిక ధరకు విక్రయం.. గుడివాడ థియేటర్‌కు జరిమానా
- గుడివాడలోని జీ3 భాస్కర్ థియేటర్‌లో టికెట్ల ధర పెంపు
- టికెట్లపై ధర ముద్రించని వైనం
- ప్రేక్షకుల నుంచి ఫిర్యాదులు అందడంతో విచారణ
- రూ. 50 వేల జరిమానా విధించిన వైనం
డైమండ్ కేటగిరీ టికెట్ ధర రూ. 70 అయితే దానిని రూ. 100కు విక్రయిస్తున్నారని, అలాగే, పలు టికెట్లపై ధరలను ముద్రించలేదని ఆర్ఐ తెలిపారు. ఆర్ఐ అరవింద్ పంపిన నివేదికను పరిశీలించిన జేసీ మాధవీలత థియేటర్ యాజమాన్యానికి రూ. 50 వేల జరిమానా విధించారు. ఈ థియేటర్‌ను మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని శుక్రవారమే ప్రారంభించడం గమనార్హం.