ఏపీలో 141 కరోనా కేసులు.. ముగ్గురి మృతి
- గత 24 గంటల్లో 15,213 కరోనా పరీక్షలు
- తూర్పు గోదావరిలో 27, గుంటూరు జిల్లాలో 23 కేసులు
- కడప జిల్లాలో కొత్త కేసుల్లేవ్
- ఇంకా 3,518 మందికి చికిత్స
అదే సమయంలో 1,329 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,17,605 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 22,99,362 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,518 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనా మృతుల సంఖ్య 14,725కి పెరిగింది.