విజయవాడలో కేసీఆర్ భారీ ఫ్లెక్సీ

Pawan fans puts flexi of KCR in Vijayawada
  • కేసీఆర్ ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన పవన్ కల్యాణ్ అభిమానులు
  • తెలంగాణలో 'భీమ్లా నాయక్'కు ఐదు షోలు వేసుకోవడానికి అనుమతించిన ప్రభుత్వం
  • ఫ్లెక్సీపై కేటీఆర్, తలసాని ఫొటోలు
విజయవాడలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ ఫ్లెక్సీ వెలిసింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. 'భీమ్లా నాయక్' సినిమాకు తెలంగాణ ప్రభుత్వం ఐదు షోలు వేసుకోవడానికి అనుమతించిన సంగతి తెలిసిందే. అంతేకాదు సినిమా టికెట్ ధరలను కూడా టీఎస్ ప్రభుత్వం ఇటీవల పెంచింది. 

ఈ నేపథ్యంలో కేసీఆర్ పై పవన్ ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చాటుకున్నారు. మరోవైపు ఈ చిత్రానికి ఏపీలో పలు చోట్లు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలోనే పవన్ ఫ్యాన్స్ కేసీఆర్ ఫ్లెక్సీని ఏర్పాటు చేసినట్టు భావిస్తున్నారు.

'హ్యాట్సాఫ్ సీఎం సర్' అంటూ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. ఈ ఫ్లెక్సీపై తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, దివంగత వంగవీటి మోహన రంగా, వంగవీటి రాధా, జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఫొటోలను కూడా ఉంచారు. 

నగరంలోని కృష్ణలంకలో ఫైర్ స్టేషన్ సమీపంలో ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీ ఏర్పాటు నగరంలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు హిట్ టాక్ తెచ్చుకున్న 'భీమ్లా నాయక్' భారీ వసూళ్లను రాబడుతోంది.
Go Back to Shorts
Vijayawada
KCR
TRS
Flexi
Pawan Kalyan
Janasena
Bheemla Nayak Movie

More Telugu News