Rana Daggubati: వావ్.. .ఈ రోజంతా అభినందనలే!: రానా

Rana thanked everyone after Bheemla Nayak gets huge response
  • భీమ్లా నాయక్ కు బ్లాక్ బస్టర్ టాక్
  • డేనియల్ శేఖర్ పాత్రలో జీవించిన రానా
  • రానా నటనకు విమర్శకుల ప్రశంసలు
  • అందరికీ కృతజ్ఞతలు తెలిపిన రానా
భీమ్లా నాయక్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో నటుడు రానా దగ్గుబాటి ఆనందోత్సాహాల్లో తేలిపోతున్నాడు. పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ గా నటించిన ఈ చిత్రంలో రానా డేనియల్ శేఖర్ గా కనిపించాడు. ఎక్కడ చూసినా పాజిటివ్ రివ్యూలే దర్శనమిస్తున్నాయి. పవన్ కల్యాణ్, రానాల నటనకు జేజేలు పలుకుతున్నారు.

ఈ నేపథ్యంలో, రానా సోషల్ మీడియాలో స్పందించాడు. "వావ్... ఇవాళ అంతా అభినందనలు వెల్లువెత్తాయి. అభిమానులకు, ప్రేక్షకులకు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన సితార ఎంటర్టయిన్ మెంట్స్ సంస్థకు, వంశీ, చినబాబు గారు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, అద్భుతమైన కథానాయకుడు పవన్ కల్యాణ్ గారికి కృతజ్ఞతలు" అంటూ రానా ట్వీట్ చేశారు.
Rana Daggubati
Bheemla Nayak
Daniel Sekhar
Pawan Kalyan
Tollywood

More Telugu News