dabang delhi: ప్రో క‌బ‌డ్డీ విజేత‌గా ద‌బంగ్ ఢిల్లీ

dabang delhi is pro kabaddi titlewinner
  • వ‌రుస‌గా రెండో సారి ఫైన‌ల్ చేరిన ఢిల్లీ
  • ప‌ట్నా పైరేట్స్‌తో హోరాహోరీ పోరు
  • తొలి టైటిల్‌ను ముద్దాడిన ఢిల్లీ
నెల రోజుల‌కు పైగా సాగిన ప్రో క‌బ‌డ్డీ ఎనిమిదో సీజ‌న్ కాసేప‌టి క్రితం ముగిసింది. హోరాహోరీగా సాగిన ఫైన‌ల్ మ్యాచ్ లో ద‌బంగ్ ఢిల్లీ..ప‌ట్నా పైరేట్స్‌ను చిత్తు చేసి తొలి టైటిల్‌ను చేజిక్కించుకుంది. కాసేప‌టి క్రితం ముగిసిన టైటిల్ పోరులో ద‌బంగ్ ఢిల్లీకి ప‌ట్నా పైరేట్స్ గ‌ట్టి పోటీనే ఇచ్చింది. తొలి హాఫ్‌లో ఢిల్లీ 15 పాయింట్లు సాధిస్తే..ప‌ట్నా ఏకంగా 17 పాయింట్లు సాధించింది.

అయితే రెండో హాఫ్‌లో ఢిల్లీ శ‌క్తిని కూడ‌దీసుకుని టైటిల్‌ను చేజిక్కించుకుంది. సెకండ్ హాఫ్ లో ప‌ట్నా 19 పాయింట్లు సాధిస్తే.. ఢిల్లీ 22 పాయింట్లు సాధించి, విజేత‌గా నిలిచింది. గ‌త సీజ‌న్‌లోనూ ఢిల్లీ ఫైన‌ల్‌కు చేరుకున్నా..టైటిల్ పోరులో మాత్రం చ‌తికిల‌బ‌డిపోయింది. అయితే ఈ దఫా మాత్రం కాస్తంత ప‌ట్టుద‌ల‌గా ఆడిన ఢిల్లీ..ఎట్ట‌కేల‌కు ప్రో క‌బ‌డ్డీ టైటిల్‌ను చేజిక్కించుకుంది.
dabang delhi
patna pirates
prokabaddi

More Telugu News