బీ ఫార్మసీ విద్యార్థుల నిర్వాకం... ట్రాన్స్‌జెండర్ మృతి
- ట్రాన్స్ జెండర్‌కు ఆపరేషన్
- ఆపరేషన్ వికటించి శ్రీకాంత్ మృతి
- మృతుడి సోదరి ఫిర్యాదుతో కేసు నమోదు
నెల్లూరులో బీ ఫార్మసీ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ పరిసరాల్లోని ఓ లాడ్జీకి శ్రీకాంత్‌ను తీసుకెళ్లారు. అక్కడ శ్రీకాంత్‌కు మత్తుమందు ఇచ్చి ఆపరేషన్ చేసి అతడి మర్మాంగాలను తొలగించారు. అయితే ఆపరేషన్ వికటించడంతో శ్రీకాంత్ చనిపోయాడు. విషయం గ్రహించిన విద్యార్థులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై శ్రీకాంత్ సోదరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విద్యార్థుల కోసం గాలిస్తున్నారు.