"వేదనలో వేడుకలా వెలుగు సెబా"... 'సెబాస్టియన్‌ పీసీ 524' నుంచి మరో పాట విడుదల

Another song from Sebastian movie
  • కిరణ్ అబ్బవరం హీరోగా 'సెబాస్టియన్...' చిత్రం
  • బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం
  • సంగీతం అందించిన జిబ్రాన్
  • మార్చి 4న విడుదల
కిరణ్‌ అబ్బవరం హీరోగా తెరకెక్కిన 'సెబాస్టియన్ పీసీ 524' చిత్రం నుంచి ఆకట్టుకునే మరో గీతం విడుదలైంది. "కంటిలోన చీకటిని గుండెలోన దాచుకుని... వేదనలో వేడుకలా వెలుగు సెబా...రాజాధి రాజా!" అంటూ సాగే ఈ పాటను చిత్రబృందం నేడు రిలీజ్ చేసింది. జిబ్రాన్ బాణీలకు భరద్వాజ్ పాత్రుడు సాహిత్యం అందించారు. 'సెబాస్టియన్ పీసీ 524'లో కిరణ్ అబ్బవరం సరసన కోమలీ ప్రసాద్, నువేక్ష నటించారు.

జ్యోవిత సినిమాస్ పతాకంపై ఎలైట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్ నిర్మించారు. ఈ చిత్రానికి బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించారు. 'సెబాస్టియన్‌ పీసీ 524' మార్చి 4న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన 'హేలి' సాంగ్ యూట్యూబ్ లో భారీ స్పందన అందుకుంది. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందించారు. ఇందులో కిరణ్ అబ్బవరం రేచీకటి కలిగిన పోలీసు కానిస్టేబుల్ గా నటించారు. ఆయన గత చిత్రాలు 'రాజా వారు రాణి గారు', 'ఎస్.ఆర్.కల్యాణమండపం' చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. మూడో చిత్రం 'సెబాస్టియన్ పీసీ 524' కూడా ప్రేక్షకులను అలరిస్తుందని, కిరణ్ కు హ్యాట్రిక్ విజయం ఖాయమని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
Go Back to Shorts
Sebastian PC 524
Seba
New Song
Kiran Abbavaram
Tollywood

More Telugu News