Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దగ్గుబాటి అభిరామ్ హీరోగా 'అహింస' .. ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్!

Ahimsa Pre look poster released
  • హీరోగా దగ్గుబాటి అభిరామ్
  • తేజ దర్శకత్వంలో ఫస్టు సినిమా
  • నిర్మాణ సంస్థగా ఆనంది ఆర్ట్స్
  • ఆర్పీ పట్నాయక్ రీ ఎంట్రీ  
రామానాయుడు ఫ్యామిలీ నుంచి వచ్చిన వెంకటేశ్ స్టార్ హీరోగా తన సుదీర్ఘమైన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇక ఆ తరువాత వచ్చిన రానా విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు రానా సోదరుడు అభిరామ్ కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.

తేజ దర్శకత్వంలో అభిరామ్ సినిమా రూపొందుతోందనే టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. కానీ ఎలాంటి అప్ డేట్స్ మాత్రం వదల్లేదు. ఈ రోజున దర్శకుడు తేజ పుట్టినరోజు కావడంతో .. ఈ సినిమాను నిర్మిస్తున్న ఆనంది ఆర్ట్స్ బ్యానర్ వారు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ టైటిల్ తో పాటు ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఈ సినిమా టైటిల్ 'అహింస' అయితే అందుకు పూర్తి భిన్నంగా హింసకి గురైన హీరో ప్రీ లుక్ ను రిలీజ్ చేయడం ఆసక్తిని రేకెత్తించే అంశం. లవ్ ... యాక్షన్ .. ఎమోషన్ ను మిక్స్ చేసి తేజ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. చాలా కాలంగా సినిమాలకి దూరంగా ఉంటూ వచ్చిన ఆర్పీ పట్నాయక్, సంగీత దర్శకుడిగా ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం.
Abhiram
Teja
Ahimsa Movie

More Telugu News