Roja: గౌతమ్‌రెడ్డితో తన అనుబంధం గురించి భావోద్వేగంగా స్పందించిన రోజా!

Goutham Reddy is like own brother to me says Roja
  • గౌతమ్ నాకు సొంత సోదరుడు వంటివారు
  • ఎవరితోనైనా కలిసిపోయే స్వభావం ఆయనది
  • జగన్, గౌతమ్ మంచి స్నేహితులు
ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మరణంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ గౌతమ్‌రెడ్డి తనకు సొంత సోదరుడు వంటివారని భావోద్వేగానికి గురయ్యారు. అత్యున్నత విద్యను అభ్యసించారని, ఎవరితోనైనా ఇట్టే కలిసిపోయే స్వభావం కలిగినవారని చెప్పారు. ఆయన మరణం వైసీపీకి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి జగన్, గౌతమ్ రెడ్డి మంచి మిత్రులని చెప్పారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత గుండెపోటు వచ్చి చాలా మంది చనిపోయారని అన్నారు. చివరిసారిగా 20 రోజుల క్రితం తాను గౌతమ్‌రెడ్డితో మాట్లాడానని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
Roja
Mekapati Goutham Reddy
Jagan
YSRCP

More Telugu News