Budda Venkanna: మీ చెల్లెలు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు: సీఎం జగన్ పై ధ్వజమెత్తిన బుద్ధా

Budda Venkanna take a dig at CM Jagan
  • కొనసాగుతున్న వివేకా హత్య కేసు విచారణ
  • వీడియోను పంచుకున్న బుద్ధా వెంకన్న
  • వీడియోలో డాక్టర్ సునీతారెడ్డి వ్యాఖ్యలు
  • ఏపీ సర్కారు సహకరిస్తే సీబీఐని ఎందుకు ఆశ్రయిస్తానని వెల్లడి

వైఎస్ వివేకా హత్య కేసులో విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి వ్యాఖ్యల క్లిప్పింగ్ ను బుద్ధా వెంకన్న పంచుకున్నారు.

 ఆ వీడియోలో... ఓ మీడియా ప్రతినిధి డాక్టర్ సునీతను ప్రశ్నించడం చూడొచ్చు. ఏపీ ప్రభుత్వం సహకరిస్తుందని అనుకుంటున్నారా? అని మీడియా ప్రతినిధి అడగ్గా... అది వాళ్లనే అడగాలని డాక్టర్ సునీతారెడ్డి బదులిచ్చారు. అంతేకాదు, ఏపీ ప్రభుత్వం సహకరించి ఉంటే తాను సీబీఐని ఎందుకు ఆశ్రయిస్తానని తిరిగి ప్రశ్నించారు.

దీనిపై బుద్ధా వెంకన్న వ్యాఖ్యానిస్తూ... మీ చెల్లెలు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు జగన్... నీ నుంచి, నీ ప్రభుత్వం నుంచి సహకారం లేక, ఢిల్లీ రోడ్లపై మీ ఇంటి ఆడపడుచు తిరుగుతుంటే సజ్జలతో డ్రామాలు ఆడిస్తావా? అంటూ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News