Jagga Reddy: కాంగ్రెస్ ను వీడొద్దంటూ జగ్గారెడ్డి కాళ్లు పట్టుకుని బతిమాలిన పీసీసీ ప్రధాన కార్యదర్శి... వీడియో ఇదిగో!

Jaggareddy met VH in Hyderabad
  • కాంగ్రెస్ పార్టీని వీడాలనుకుంటున్న జగ్గారెడ్డి
  • తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం
  • ఓ హోటల్ లో వీహెచ్ ను కలిసిన జగ్గారెడ్డి
  • జగ్గారెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు
తెలంగాణ కాంగ్రెస్ లో జగ్గారెడ్డి రూపంలో మరో అసంతృప్తి గళం వినిపిస్తోంది. పార్టీ నుంచి ఆయన తప్పుకోవాలన్న నిర్ణయం రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. కాగా, జగ్గారెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు రంగంలోకి దిగారు. వీహెచ్ ను జగ్గారెడ్డి ఓ హోటల్ లో కలిశారు.

అయితే, అక్కడే ఉన్న పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లి కిషన్... జగ్గారెడ్డి కాళ్లు పట్టుకుని మరీ బతిమాలడం వీడియోలో కనిపించింది. రాజీనామా చేయబోనని ప్రకటిస్తేనే కాళ్లు వదులుతానని బొల్లి కిషన్ పేర్కొన్నారు. నువ్వు పైకి లెగు అంటూ జగ్గారెడ్డి... నువ్వు చెబుతానంటే నేను లేస్తా అంటూ బొల్లి కిషన్... వీడియోలో ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. ఇదంతా ఓ సోఫాలో కూర్చుని వీహెచ్ చూస్తూనే ఉన్నారు. ఆయన ఈ తతంగంపై తనదైన శైలిలో ఛలోక్తులు విసిరారు.
Jagga Reddy
VH
Congress
Telangana

More Telugu News