Keerthi Suresh: కీర్తి సురేశ్ 'వాశి' నుంచి ఫస్టులుక్!

Malayalam movie Vaashi first look released
  • స్టార్ హీరోయిన్ గా కీర్తి సురేశ్
  • తెలుగు .. తమిళ భాషల్లో బిజీ
  • మలయాళంలోను మంచి గుర్తింపు
  • టోవినో థామస్ జోడీగా 'వాశి'    
కీర్తి సురేశ్ తెలుగు .. తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పేస్తోంది. తెలుగులో మహేశ్ జోడీగా చేసిన  'సర్కారువారి పాట' .. తమిళంలో నాయిక ప్రధానమైన 'సానికాయిధం' విడుదలకు రెడీ అవుతున్నాయి. ఇక మలయాళంలో కూడా ఆమె ఒక సినిమాను పూర్తిచేసింది .. ఆ సినిమాపేరే 'వాశి'.

టోవినో థామస్ - కీర్తి సురేశ్ ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ ఇద్దరి కాంబినేషన్లోని ఫస్టులుక్ ను ఈ సినిమా నుంచి వదిలారు. ఇద్దరూ కూడా న్యాయవాదులుగా ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు. రేవతి కళామందిర్ బ్యానర్ పై సురేశ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకి విష్ణు జి రాఘవ్ దర్శకత్వం వహించాడు.

కైలాశ్ మీనన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, విభిన్నమైన కథాకథనాలతో .. ఆసక్తికరమైన మలుపులతో కొనసాగనున్నట్టుగా తెలుస్తోంది. 'మరక్కార్' తరువాత మలయాళంలో కీర్తి సురేశ్ చేసిన సినిమా ఇది. ముఖ్యమైన పాత్రల్లో నందు .. బైజు సంతోష్ .. అనూ మోహన్ .. కృష్ణన్ సోపానం కనిపించనున్నారు.
Keerthi Suresh

More Telugu News