'పుష్ప' టీమ్ తో మీటింగ్ పెట్టిన బన్నీ .. విషయం అదే!
- సంచలన విజయం సాధించిన 'పుష్ప'
- బాలీవుడ్లో 100 కోట్ల వసూళ్లు
- ఇతర భాషల్లోను హిట్ టాక్
- వచ్చే నెల నుంచి 'పుష్ప 2' షూటింగ్
వచ్చే నెల నుంచి 'పుష్ప 2' సినిమా షూటింగును మొదలుపెట్టాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ తో బన్నీ రీసెంట్ గా మీటింగును ఏర్పాటు చేశాడట. వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టి 4 నుంచి 6 నెలల్లో షూటింగు పార్టు పూర్తిచేయాలని చెప్పాడట. సాధ్యమైనంత వరకూ ఈ సినిమాను దసరా బరిలో దింపాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడని చెబుతున్నారు.
ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను గురించి సుకుమార్ టీమ్ తో చాలాసేపు చర్చించాడని అంటున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాను ఈ ఏడాదిలోనే విడుదల చేయాలి. బాలీవుడ్ లో భారీ ప్రమోషన్స్ చేసుకునే అవకాశం ఉండాలి. అందరూ కూడా ఆ దిశగా ఫాస్టుగా ముందుకు వెళ్లాలని చెప్పాడట. ఇక 'పుష్ప 2' ఈ ఏడాదిలోనే రావడం ఖాయమైపోయిందనుకోవాలి.