వయసు తప్పుగా రాశారంటూ మహిళా జర్నలిస్టుపై అనసూయ ఆగ్రహం
- ఓ మీడియా వెబ్ సైట్లో అనసూయపై కథనం
- వయసు 40 అని పేర్కొన్న పాత్రికేయురాలు
- తన వయసు 36 అని వెల్లడించిన అనసూయ
దీనిపై అనసూయ తీవ్రంగా స్పందించింది. తన వయసు 40 కాదని 36 ఏళ్లు అని స్పష్టం చేసింది. వయసు పెరగడం సాధారణ విషయం అని, అయితే మీడియా వ్యక్తులు వాస్తవాలు తెలుసుకుని రాస్తే బాగుంటుందని ఆ మహిళా జర్నలిస్టు పేరును ప్రస్తావిస్తూ అసహనం వ్యక్తం చేసింది. వయసు చెప్పుకోవడానికి తానేమీ సిగ్గుపడడంలేదని అనసూయ స్పష్టం చేసింది. జర్నలిజం అనేది ఓ అస్త్రం వంటిదని, దాన్ని సరైన రీతిలో ఉపయోగించకపోతే మనకే నష్టం అంటూ సదరు మీడియా ప్రతినిధికి హితవు పలికింది.