'భీమ్లా నాయక్' ఎఫెక్ట్ మామూలుగా లేదే!
- ఈ నెల 25వ తేదీన 'భీమ్లా నాయక్'
- మార్చి 4వ తేదీకి వెళ్లనున్న 'గని'
- 'ఆడవాళ్లు మీకు జోహార్లు' వాయిదాపడే ఛాన్స్
- త్వరలోనే రానున్న స్పష్టత
ఈ రెండు సినిమాలు ఇక ప్రమోషన్స్ ను వేగవంతం చేయాలని అనుకుంటూ ఉండగా, 'భీమ్లా నాయక్' తన ప్లాన్ మార్చుకుని ఈ నెల 25న రావాలని నిర్ణయించుకున్నాడు. దాంతో 'గని' టీమ్ ఆలోచనలో పడినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను మార్చి 4వ తేదీకి వాయిదా వేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.
ఇక ఇప్పుడు 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాను కూడా వాయిదా వేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ప్రస్తుతానికైతే వాళ్లు అదే డేట్ తో కూడిన పోస్టర్లను వదులుతూ వెళుతున్నారు. రిలీజ్ డేట్ కి సంబంధించిన వాయిదా విషయంలో అధికారిక ప్రకటన రావలసి ఉంది.