కేసీఆర్ కు దేవెగౌడ ఫోన్... బీజేపీ వ్యతిరేక పోరుకు మద్దతు ఇస్తున్నట్టు వెల్లడి
- కేంద్రంపై కేసీఆర్ యుద్ధం
- గత కొన్నిరోజులుగా తీవ్రస్థాయిలో విమర్శలు
- కేసీఆర్ తో దేవెగౌడ ఫోన్ సంభాషణ
- యుద్ధం కొనసాగించాలని సూచన
దేశంలో మతతత్వ రాజకీయాలపై పోరాడుతున్నారంటూ కేసీఆర్ కు అభినందనలు తెలిపారు. కేసీఆర్ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు దేవెగౌడ స్పష్టం చేశారు. లౌకికవాద పరిరక్షణ కోసం కృషి చేస్తున్న వారికి అండగా ఉంటామని, యుద్ధాన్ని కొనసాగించాలని కేసీఆర్ కు సూచించారు. ఫోన్ సంభాషణ సందర్భంగా ఇరువురు జాతీయ రాజకీయాలపై చర్చించారు.