కడప జైలర్ వరుణారెడ్డి బదిలీ... ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం
- ఇప్పటికే డీజీపీ పోస్టు నుంచి గౌతమ్ సవాంగ్ బదిలీ
- తాజాగా వరుణారెడ్డి ఒంగోలు జైలుకు బదిలీ
- ఒంగోలు జైలర్ ప్రకాశ్ కడపకు బదిలీ
- ఇటీవల వరుణారెడ్డిపై చంద్రబాబు సందేహాలు
ఇటీవల వరుణారెడ్డి అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం తెలిసిందే. గతంలో పరిటాల హత్య కేసు నిందితుడు మొద్దు శ్రీను అనంతపురం జైల్లోనే హత్యకు గురైనప్పుడు వరుణారెడ్డి జైలర్ గా ఉన్నారని, ఇప్పుడదే వరుణారెడ్డి కడప జైలర్ గా ఉన్నారని చంద్రబాబు తెలిపారు.
కడప జైల్లో ప్రస్తుతం వివేకా హత్య కేసు నిందితులు ఉన్నందున, వారిని హతమార్చేందుకు కుట్ర చేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. వరుణారెడ్డి కడప జైలర్ గా ఉండడంపై తమకు అనుమానంగా ఉందని, దీనిపై తాము సీబీఐకి లేఖ రాస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ క్రమంలో, ఏపీ ప్రభుత్వం వరుణారెడ్డిని కడప జైలు నుంచి ఒంగోలు కారాగారానికి బదిలీ చేసింది.