'భీమ్లా నాయక్' కోసం కైలాశ్ ఖేర్ పాట!
- 'భీమ్లా నాయక్'గా పవన్ కల్యాణ్
- డేనియల్ శేఖర్ గా రానా
- సంగీత దర్శకుడిగా తమన్
- త్వరలో ప్రేక్షకుల ముందుకు
"మా సెన్సేషనల్ 'భీమ్లా నాయక్'లో మరో క్రేజీ ఎడిషన్ .. ఈ సినిమాలో ఒక పాటను పాడటానికిగాను కైలాశ్ ఖేర్ ను త్రివిక్రమ్ గారు తీసుకొచ్చారు. ఈ పాటను రామజోగయ్య శాస్త్రిగారు రాశారు" అని చెబుతూ, ఆ సందర్భంలో దిగిన ఒక ఫొటోను తమన్ పోస్ట్ చేశాడు. అయితే ఈ సినిమాలో ఏదైనా సందర్భంలో ఒక పాట ఉంటే బాగుంటుందని భావించి కొత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారేమోనని అనిపిస్తోంది.
ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఈగో వార్. మరో కథానాయకుడిగా డేనియల్ శేఖర్ పాత్రలో రానా నటించాడు. పవన్ సరసన నిత్యామీనన్ .. రానా జోడీగా సంయుక్త మీనన్ అలరించనున్నారు. ఈ సినిమాకి రెండు రిలీజ్ డేట్లు అనుకున్నారు. త్వరలోనే ఒక రిలీజ్ డేట్ ను ఖరారు చేయనున్నారు.