కాకినాడలో ఖైదీ బిర్యానీ... జైలు కాదు రెస్టారెంటే!
- కొత్త కాన్సెప్ట్ తో రెస్టారెంట్
- జైలు ఖైదీల యూనిఫాంలో సర్వర్లు
- జైలు గదుల తరహాలో ఊచలతో ప్రత్యేక క్యాబిన్లు
- గిరాకీ బాగానే ఉందంటున్న యాజమాన్యం
తమ వంటకాల రుచులతోనే కాకుండా, సరికొత్త కాన్సెప్ట్ తోనూ కస్టమర్లను ఆకట్టుకోవాలని భావిస్తున్నామని ఖైదీ బిర్యానీ రెస్టారెంట్ యాజమాన్యం చెబుతోంది. కాకినాడలోని ఈ జైలు కాన్సెప్టు రెస్టారెంట్ కు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారట. ఇందులో 16 సాధారణ క్యాబిన్లు, ఒక వీఐపీ క్యాబిన్ ఏర్పాటు చేశారు.

