ప‌వ‌న్ క‌ల్యాణ్ సీఎం అయ్యాక‌ ఈ ప‌ని చేస్తారు: నాదెండ్ల మ‌నోహ‌ర్ వ్యాఖ్య‌లు

Nadendla Manohar slams jagan govt
  • మ‌త్స్య‌కారుల స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌మే జ‌న‌సేన ధ్యేయం
  • ప‌వ‌న్ సీఎం అయ్యాక మ‌త్స్య‌కారుల అభివృద్ధికి కృషి
  • అభివృద్ధి పేరుతో మ‌త్స్య‌కారుల కుటుంబాల‌ను ఖాళీ చేయించ‌డం స‌రికాదు
  • మత్స్యకార అభ్యున్నతి యాత్రలో పాల్గొన్న నాదెండ్ల‌
జనసేన మత్స్య వికాస విభాగం ఆధ్వ‌ర్యంలో ఆ పార్టీ మత్స్యకార అభ్యున్నతి యాత్ర ప్రారంభించింది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం సూర్యరావుపేటలో ఈ యాత్రను జ‌న‌సేన నేత నాదెండ్ల మ‌నోహ‌ర్ ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. మ‌త్స్య‌కారుల స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌మే జ‌న‌సేన ధ్యేయ‌మ‌ని చెప్పారు.

త‌మ పార్టీ అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ సీఎం అయ్యాక మ‌త్స్య‌కారుల అభివృద్ధికి కృషి చేస్తార‌ని ఆయ‌న అన్నారు. అభివృద్ధి పేరుతో మ‌త్స్య‌కారుల కుటుంబాల‌ను ఖాళీ చేయించ‌డం స‌రికాద‌ని ఆయ‌న చెప్పారు. వెంట‌నే మ‌త్స్య‌కారుల‌ను ఆదుకునేలా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. కాగా, మత్స్యకార అభ్యున్నతి యాత్రలో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

                     
Go Back to Shorts
Nadendla Manohar
Janasena
Andhra Pradesh

More Telugu News