హ్యూ ఎడ్మీడియస్ కు విశ్రాంతి... చారుశర్మతో ఐపీఎల్ వేలం కొనసాగింపు
- ఐపీఎల్ వేలంలో ఊహించని ఘటన
- వేలం నిర్వహిస్తూ స్పృహకోల్పోయిన ఎడ్మీడియస్
- పోస్టురల్ హైపోటెన్షన్ అని ఐపీఎల్ యాజమాన్యం వెల్లడి
- ఎడ్మీడియస్ ఆరోగ్యం నిలకడగా ఉందని వివరణ
ఈ ఘటన దురదృష్టకరమని ఐపీఎల్ యాజమాన్యం పేర్కొంది. ఆయనను వైద్య నిపుణులు నిశితంగా పరిశీలించారని, ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వెల్లడించింది. దీంతో ఐపీఎల్ ఆటగాళ్ల వేలాన్ని చారుశర్మతో కొనసాగిస్తున్నట్టు తెలిపింది.
చారుశర్మ ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత, టీవీ ప్రజెంటర్. ప్రొ కబడ్డీ లీగ్ లో డైరెక్టర్ గానూ ఉన్నారు. టీవీ చానళ్లలో క్విజ్ లు నిర్వహించడంలో దిట్టగా చారుశర్మ గుర్తింపు తెచ్చుకున్నారు.