షూటింగులో గాయపడిన సినీ నటుడు విశాల్.. వీడియో ఇదిగో..
- లాఠీ సినిమా చిత్రీకరణలో గాయం
- బాలుడిని రక్షించి కిందికి దూకే యత్నంలో చేతికి గాయాలు
- విశ్రాంతి, చికిత్స కోసం కేరళ వెళ్తున్నట్టు చెప్పిన విశాల్
పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాను ఎ.వినోద్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. రమణ, నంద నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో సునయన కథానాయిగా నటిస్తున్నారు. కాగా, ఫైట్ సీన్ చిత్రీకరిస్తుండగా స్వల్పంగా గాయపడినట్టు పేర్కొన్న విశాల్.. చికిత్స, విశ్రాంతి కోసం కేరళ వెళ్తున్నట్టు తెలిపారు. మార్చి తొలి వారంలో తిరిగి తుది షెడ్యూల్‌లో పాల్గొంటానని విశాల్ పేర్కొన్నారు.