ఏపీలో మరో 1,166 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో గడచిన 24 గంటల్లో 25,495 కరోనా పరీక్షలు చేపట్టగా 1,166 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 256 కొత్త కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 184, గుంటూరు జిల్లాలో 127, పశ్చిమ గోదావరి జిల్లాలో 109 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 9,632 మంది కరోనా నుంచి కోలుకోగా, ఐదుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,11,133 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 22,64,032 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 32,413 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,688కి పెరిగింది.

Andhra Pradesh
Corona Virus
Bulletin
Today Cases

More Telugu News