Wrestler: బీజేపీలో చేరిన ‘ద గ్రేట్ ఖలి’

Wrestler The Great Khali joins Bharatiya Janata Party
  • ఆహ్వానించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు
  • ప్రధాని చేస్తున్న సేవలకు మద్దతు
  • బీజేపీ జాతీయ విధానం నచ్చి చేరుతున్నానన్న ఖలి 

గ్రేట్ ఖలి.. దేశ ప్రజల్లో ఎక్కువ మందికి పరిచయం ఉన్న ముఖం. అంతర్జాతీయంగా ‘రెజ్లర్’ ఆటలో ఎన్నో మెడల్స్ సంపాదించిన మల్ల యుద్ధ వీరుడు. గ్రేట్ ఖలిగా పిలుచుకునే దలీప్ సింగ్ రాణా బీజేపీలో చేరారు. గురువారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.

‘‘బీజేపీలో చేరినందుకు సంతోషంగా ఉంది. దేశానికి ప్రధాని చేస్తున్న కృషి ఆయన్ను సరైన ప్రధానిని చేస్తుందన్నది అని నా అభిప్రాయం. దేశ అభివృద్ధి కోసం ఆయన పాలనలో నేనూ ఎందుకు భాగం కాకూడదన్నది నా ఆలోచన. బీజేపీ జాతీయ విధానం నచ్చి బీజేపీలో చేరుతున్నాను’’ అని గ్రేట్ ఖలి ప్రకటించారు.

పంజాబ్ రాష్ట్ర ఎన్నికల ముందు ఆ రాష్ట్రానికే చెందిన ఖలి బీజేపీలో చేరడం పార్టీకి ఎంతో కొంత లాభించనుంది. 49 ఏళ్ల గ్రేట్ ఖలి ప్రొఫెషనల్ రెజ్లర్. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఛాంపియన్ షిప్ ద్వారా ఇతడు సుపరిచితుడు. నటుడు కూడా.  రెండు బాలీవుడ్ సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించాడు. 7 అడుగుల ఒక అంగుళం ఎత్తుతో, తన ఆటతీరుతో అందరి దృష్టినీ ఆకర్షించేవాడు.

  • Loading...

More Telugu News