ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల.. పరీక్షలు ఎప్పుడంటే..!
- మే 2 నుంచి 13 వరకు టెన్త్ పరీక్షలు
- ఏప్రిల్ 8 నుంచి 28 వరకు ఇంటర్ ఎగ్జామ్స్
- మార్చి 11 నుంచి 31 దాకా ప్రాక్టికల్స్
కాగా, స్కూళ్లు, కాలేజీలను కరోనా నిబంధనల ప్రకారమే నడిపిస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు. కరోనా నిబంధనల ప్రకారమే పరీక్షలనూ నిర్వహిస్తామన్నారు. ఇంటర్ ఫస్టియర్ లో మొత్తం 5,05,052 మంది విద్యార్థులు, సెకండియర్ లో 4,81,481 మంది విద్యార్థులున్నారన్నారు. పదో తరగతిలో 6,39,805 మంది విద్యార్థులున్నట్టు ఆయన చెప్పారు.