Chiranjeevi: గన్నవరం విమానాశ్రయం నుంచి జ‌గ‌న్ వ‌ద్ద‌కు బయలుదేరిన సినీ ప్రముఖులు.. వీడియో ఇదిగో

chiranjeevi to meets jagan
షార్ట్స్‌లో చూడండి
ఏపీలోని థియేట‌ర్ల‌లో టికెట్ల ధ‌ర‌లు స‌హా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌ల‌పై ముఖ్యమంత్రితో చ‌ర్చించేందుకు బయలుదేరిన సినీ ప్రముఖులు గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అనంత‌రం అక్క‌డి నుంచి తాడేప‌ల్లిలోని ఏపీ ముఖ్యమంత్రి జ‌గ‌న్ క్యాంపు కార్యాల‌యానికి రోడ్డు మార్గం ద్వారా బ‌య‌లుదేరారు.

  కాసేప‌ట్లో జ‌గ‌న్ తో వీరి భేటీ ప్రారంభం కానుంది. గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టు చేరుకున్న వారిలో చిరంజీవి, ప్రభాస్‌, మహేశ్‌బాబు త‌దిత‌రులు ఉన్నారు. ఏపీ ప్ర‌భుత్వం నుంచి ఆహ్వానం అందుకున్న‌ సినీ ప్ర‌ముఖులు మాత్ర‌మే తాడేప‌ల్లికి వెళ్తున్నారు.

జగన్ తో చిరంజీవి, ప్రభాస్‌, మహేశ్‌బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణమురళి, అలీ, ఆర్.నారాయ‌ణ మూర్తి భేటీ కానున్నారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ ఈ భేటీకి హాజ‌రు అవుతున్నారా? లేదా? అన్న విష‌యంపై స్ప‌ష్ట‌త లేదు.
Go Back to Shorts
Chiranjeevi
Jagan
Mahesh Babu

More Telugu News